విశాఖలో లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విశాఖలో లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం

Gang rape on law student in Vizag
  • ఎన్వీపీ లా కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న బాధితురాలు
  • సహచర విద్యార్థి వంశీతో స్నేహం చేసిన బాధితురాలు
  • వంశీతో పాటు అతని ముగ్గురు స్నేహితులు సామూహిక అత్యాచారం
ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని శిక్షలు పడినా కామాంధుల తీరు మాత్రం మారడం లేదు. దేశ వ్యాప్తంగా అత్యాచార ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా విశాఖలో మరో దారుణం చోటుచేసుకుంది. న్యాయ విద్యను అభ్యసిస్తున్న ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. 

వివరాల్లోకి వెళితే... పోలీసులు చెపుతున్న వివరాల ప్రకారం బాధితురాలు మధురవాడలోని ఎన్వీపీ లా కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతోంది. తన సహచర విద్యార్థి అయిన వంశీతో ఆమె స్నేహం చేసింది. తాను పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించిన వంశీ... గత ఆగస్ట్ 10న కంబాలకొండకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 

ఆ తర్వాత అదే నెల 13న డాబా గార్డెన్స్ లోని తన స్నేహితుడు ఆనంద్ ఇంటికి తీసుకెళ్లి మరోసారి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత వంశీ స్నేహితులు ఆనంద్, రాజేశ్, జగదీశ్ కూడా ఆమెపై అత్యాచారం చేశారు. ఆ దృశ్యాలను తమ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ తర్వాత ఆమెను బెదరిస్తూ పలుమార్లు అత్యాచారం చేశారు. 

రెండు నెలల తర్వాత ఆనంద్, రాజేశ్, జగదీశ్ బాధితురాలికి ఫోన్ చేసి తమ వద్దకు రావాలని, లేకపోతే వీడియోలు బయటపెడతామని బెదిరించారు. ఈ విషయాన్ని ఆమె వంశీ దృష్టికి తీసుకెళ్లింది. వంశీ కూడా వారి కోరిక తీర్చాలని ఆమెను వేధించాడు. రోజురోజుకూ ఆమెకు వేధింపులు ఎక్కువయ్యాయి. 

దీంతో నిన్న ఆమె ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించింది. ఇది గమనించిన బాధితురాలి తండ్రి ఆమెను అడ్డుకుని... ఏం జరిగిందని నిలదీశారు. దీంతో, అసలు విషయం బయటపడింది. ఆయన వెంటనే విశాఖ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురినీ అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు.
Vizag
Gang Rape

More Telugu News