PM Modi: దేశాధినేతలతో భారత ప్రధాని మోదీ కీలక భేటీలు

modis key meetings with world leaders
షార్ట్స్‌లో చూడండి
బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో జరుగుతున్న జీ 20 సదస్సులో భారత ప్రధాని మోదీ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పలువురు దేశాధినేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తదితరులతో చర్చించిన విషయాలపై మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 

నా స్నేహితుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌ను కలవడం ఎంతో సంతోషంగా ఉందని మోదీ పేర్కొన్నారు. భారత్, ఫ్రాన్స్‌లు అంతరిక్షం, ఇంధనం, ఏఐ వంటి ఇతర రంగాలలో సన్నిహితంగా పని చేయడంపై చర్చించామని రాసుకొచ్చారు. ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలను బలపరిచేందుకు పని చేస్తామని అన్నారు. అలాగే ఈ ఏడాది ప్రారంభంలో పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్‌ను సమర్థవంతంగా నిర్వహించారని మెక్రాన్‌ను ప్రశంసించినట్లు మోదీ తెలిపారు.

బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో చర్చల విషయంపై రాబోయే కాలంలో సాంకేతికత, గ్రీన్ ఎనర్జీ, భద్రత, ఆవిష్కరణ వంటి రంగాల్లో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని వెల్లడించారు. వాణిజ్యంతో పాటు సాంస్కృతిక సంబంధాలను సైతం బలపరచాలని భావిస్తున్నట్లుగా మోదీ పేర్కొన్నారు. మరో వైపు ఇటలీ, యూకే, ఇండోనేషియా, నార్వే, పోర్చుగల్‌ సహా పలు దేశాధినేతలతో కూడా మోదీ భేటీ  అయ్యారు. 
Go Back to Shorts
PM Modi
G 20 summit
Brazil

More Telugu News