టీడీపీ కార్యాలయంపై దాడి కేసు.. పోలీసుల అదుపులో వల్లభనేని వంశీ ముఖ్య అనుచరులు
గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వంశీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. కార్యాలయ ఆవరణలోని కారుకు నిప్పంటించి లోపల ఉన్న సామగ్రిని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తాజాగా వంశీ అనుచరులను అదుపులోకి తీసుకున్నారు.