తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోండి: అయ్యన్నపాత్రుడు ఆదేశం
- జగనన్న కాలనీలపై అసెంబ్లీలో చర్చ
- అధికారులు ఇస్తున్న నివేదికలకు, వాస్తవాలకు మధ్య తేడా ఉందన్న అయ్యన్న
- జగనన్న కాలనీలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని ఆదేశం
తప్పుడు నివేదికలు ఇచ్చే పద్ధతులను అధికారులు వెంటనే మానుకోవాలని హితవు పలికారు. అసెంబ్లీకి తప్పుడు రిపోర్టులు ఇచ్చిన అధికారులపై యాక్షన్ తీసుకుంటే... మిగిలిన అధికారులు సెట్ అవుతారని చెప్పారు. జగనన్న కాలనీలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని అన్నారు.
ఈ నేపథ్యంలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ... జగనన్న కాలనీలపై విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఆదేశించారని తెలిపారు. జగనన్న కాలనీలపై శాఖాపరమైన విచారణతో పాటు విజిలెన్స్ విచారణ కొనసాగుతోందని చెప్పారు.