లంచం తీసుకుంటూ దొరికిపోయిన రైల్వే ఉన్నతాధికారి
- కాంట్రాక్టర్ నుంచి రూ.25 లక్షలు లంచం తీసుకుంటూ సీబీఐకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్
- ముంబైలోని తన నివాసంలో కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకున్న డీఆర్ఎం
- విశాఖ డీఆర్ఎం బంగ్లాలో సోదాలు జరిపిన సీబీఐ అధికారులు
ఇదే క్రమంలో ఇటు విశాఖలోని డీఆర్ఎం బంగ్లాలో సీబీఐ శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ సీబీఐ సోదాలు జరిపింది. ఢిల్లీ, విశాఖకు చెందిన రెండు బృందాలు ఈ సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. లంచం తీసుకుంటూ దొరికిపోయిన డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్ ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.