దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ క్షిపణి పరీక్ష విజయవంతం.. 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యం తుత్తునియలు
- ఈ విజయంతో అడ్వాన్స్డ్ మిలటరీ టెక్నాలజీ కలిగిన దేశాల సరసన భారత్
- అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించిన క్షిపణి
- ఇదొక చారిత్రక ఘట్టమన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
- అభివృద్ది చేసిన హైదరాబాద్‌లోని డీఆర్డీవో
పరీక్ష అనంతరం మిసైల్ గమనాన్ని జాగ్రత్తగా పరీక్షించారు. డౌన్-రేంజ్ షిప్ స్టేషన్ల నుంచి సేకరించిన ఫ్లైట్ డేటా.. క్షిపణి అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించినట్టు నిర్ధారించిందని డీఆర్డీవో ప్రకటించింది. ఈ క్షిపణిని దేశీయంగా అభివృద్ధి చేశారు. హైదరాబాద్‌లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్‌లో డీఆర్డీవో ల్యాబరేటరీస్, ఇండస్ట్రీ పార్ట్‌నర్స్‌తో కలిసి సంయుక్తంగా రూపొందించారు. డీఆర్డీవో సీనియర్ శాస్త్రవేత్తలు, రక్షణ దళాల అధికారుల సమక్షంలో ఈ పరీక్ష నిర్వహించినట్టు డీఆర్డీవో తెలిపింది.