గుడ్‌న్యూస్.. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఆస్ట్రేలియా బయలుదేరనున్న స్టార్ పేసర్
- రంజీ ట్రోఫీలో బెంగాల్ తరపున అదరగొట్టిన పేసర్ మహ్మద్ షమీ
- మధ్యప్రదేశ్‌పై బెంగాల్ గెలుపులో కీలక పాత్ర వహించిన వైనం
- కెప్టెన్ రోహిత్‌తో కలిసి వెళ్లి టీమిండియాలో కలవనున్నట్టు కథనాలు
- గాయం కారణంగా దాదాపు ఏడాది కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్న షమీ
- కోలుకున్నాక ఇటీవలే ప్రాక్టీస్ మొదలు పెట్టిన భారత స్టార్ బౌలర్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం షమీని జట్టులోకి తీసుకోవడానికి అంతా సిద్ధమైందని ‘దైనిక్ భాస్కర్’ కథనం పేర్కొంది. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి షమీ ఆస్ట్రేలియాకు వెళ్లనున్నాడని, వారిద్దరూ మొదటి మ్యాచ్‌కు ముందే జట్టులో చేరవచ్చని పేర్కొంది. అయితే పెర్త్ వేదికగా జరిగే తొలి మ్యాచ్ తర్వాతే షమీని తుది జట్టులోకి తీసుకోనున్నారని తెలిపింది.
కాగా షమీ అద్భుత ప్రదర్శనతో రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌పై బెంగాల్ చిరస్మరణీయ విజయం సాధించింది. గత 15 ఏళ్లుగా బెంగాల్ టీమ్‌పై మధ్యప్రదేశ్ టీమ్ ఆధిపత్యం చెలాయిస్తోంది. అలాంటిది ఈసారి విక్టరీ సాధించడంలో షమీ ముఖ్య పాత్ర పోషించాడు. 338 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన మధ్యప్రదేశ్ జట్టు 326 పరుగులకు ఆలౌట్ అయింది. షమీ టీమ్‌లో ఉండడం, వికెట్లు తీయడం బెంగాల్ ఆటగాళ్లకు నైతిక బలంగా మారింది.