నారా రామ్మూర్తినాయుడి మృతిపై ఏపీ మంత్రుల దిగ్భ్రాంతి
- చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు కన్నుమూత
- తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు
- రామ్మూర్తినాయుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి
రామ్మూర్తినాయుడి మృతి చంద్రగిరి ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు తీరని లోటు అని బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. రామ్మూర్తినాయుడి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. అటు, శాప్ చైర్మన్ రవినాయుడు స్పందిస్తూ... రామ్మూర్తినాయుడి మృతి కలచివేసిందని అన్నారు.