KTR: కేసీఆర్ ను ఫినిష్ చేస్తానని రేవంత్ అంటున్నారు: కేటీఆర్

KTR fires on Revanth Reddy
షార్ట్స్‌లో చూడండి
కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను ఫినిష్ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారని... కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ మాదిరే గత 24 ఏళ్లలో ఎంతో మంది ప్రగల్భాలు పలికారని, పిచ్చి ప్రేలాపనలు చేశారని... కేసీఆర్ ను ఫినిష్ చేస్తామన్నవారే ఫినిష్ అయిపోయారని చెప్పారు. చరిత్రలోకి తొంగిచూడాలని రేవంత్ కు హితవు పలికారు. 

రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పలువురు కాంగ్రెస్ నేతలు ఈరోజు బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

2001లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆయన వెంట పిడికెడు మంది మాత్రమే ఉన్నారని... ఈనాడు లక్షలాది కార్యకర్తలు ఉన్నారని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి కులంగా, సంక్షేమం మతంగా, అందరినీ కలుపుకునిపోయి పాలన కొనసాగిందని చెప్పారు. అన్ని రంగాల్లో దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ నిలిచిందని అన్నారు. పదేళ్ల పాటు కేసీఆర్ పాలన అద్భుతంగా కొనసాగిందని చెప్పారు. 

అధికారం, పదవులు శాశ్వతం కాదని... ప్రజల గుండెల్లో సంపాదించుకున్న స్థానం శాశ్వతంగా ఉంటుందని కేటీఆర్ అన్నారు. ఆ శాశ్వత స్థానం కేసీఆర్ కు మాత్రమే సొంతమని చెప్పారు. పదవుల కోసం కొందరు ఎమ్మెల్యేలు వెళ్లిపోయినా... పార్టీని వదిలిపెట్టకుండా ఉన్న గులాబీ సైనికులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. 
Go Back to Shorts
KTR
KCR
BRS
Revanth Reddy
Congress

More Telugu News