అమెరికాలో భారీగా ప్రభుత్వ ఉద్యోగాల కోత... వివేక్ రామస్వామి హింట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికాలో భారీగా ప్రభుత్వ ఉద్యోగాల కోత... వివేక్ రామస్వామి హింట్

Vivek Ramaswamy mulls massive govt job cuts
  • ట్రంప్ కార్యవర్గంలో వివేక్ రామస్వామికి కీలక బాధ్యతలు
  • ఫెరల్ బ్యూరోక్రాట్లను తొలగించే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడి
  • ఈ దేశాన్ని కాపాడాలనుకుంటున్నామన్న వివేక్ రామస్వామి
అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగాల్లో భారీగా కోతలు ఉంటాయని భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి వెల్లడించారు. అధ్యక్షుడిగా ఎన్నికైన రిపబ్లిక్ నేత డొనాల్డ్ ట్రంప్ తన కార్యవర్గంలో వివేక్ రామస్వామికి కీలక బాధ్యతలు అప్పగించారు. ఇటీవల ఫ్లోరిడాలోని ట్రంప్ ఎస్టేట్ మారలాగోలో జరిగిన ఓ కార్యక్రమంలో వివేక్ రామస్వామి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... లక్షలమంది ఫెడరల్ బ్యూరోక్రాటన్లు బ్యూరోక్రసీ నుంచి సామూహికంగా తొలగించే ప్రణాళికలో తాను, ఎలాన్ మస్క్ ఉన్నామని తెలిపారు. అలా ఈ దేశాన్ని తాము కాపాడాలనుకుంటున్నామని వ్యాఖ్యానించారు.
Advertisement
Vivek Ramaswamy
USA

More Telugu News