బంగారు పడగ పాము.. విశాఖలో అరుదైన స్నేక్

Golden Cobra Catched In Vizag Navy Quarters
--
విశాఖపట్నంలోని యారాడ నేవీ ఉద్యోగుల క్వార్టర్స్ లో అరుదైన నాగు పాము కనిపించింది. ఈ పాము పడగ మొత్తం బంగారు వర్ణంలో కనిపిస్తోంది. పడగకు ముందు వెనుక మాత్రమే బంగారు వర్ణంలో, మిగతా భాగం మొత్తం సాధారణంగా ఉండడం విశేషం. ఓ ఉద్యోగి కార్ షెడ్ లో కనిపించిందీ పాము. కారు బయటకు తీస్తున్న సమయంలో ఈ పామును చూసిన సదరు ఉద్యోగి స్నేక్ క్యాచర్ నాగరాజుకు ఫోన్ లో సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న నాగరాజు ఈ పామును బంధించారు. ఈ అరుదైన పామును స్థానికులు ఆసక్తిగా తిలకించారు. అనంతరం స్నేక్ క్యాచర్ నాగరాజు ఈ పామును జనావాసాలకు దూరంగా వదిలిపెట్టారు. కాగా, ఇలాంటి పాములు చాలా అరుదుగా కనిపిస్తాయని, తొమ్మిదేళ్ల క్రితం ఇలాంటి పామును చూశానని నాగరాజు చెప్పారు.
Go Back to Shorts
Golden Crobra
Viral Pics
Vizag
Snake Catcher
Navy Staff
Yarada

More Telugu News