కేసుల మీద కాదు... వీటిపై దృష్టిపెట్టండి... ఈ వార్త చదువుతుంటేనే హృదయం ద్రవిస్తోంది: అంబటి రాంబాబు
- మరోసారి కూటమి ప్రభుత్వంపై 'ఎక్స్' వేదికగా మాజీ మంత్రి విమర్శలు
- ఎన్‌టీఆర్ జల్లా పెనుగంచిప్రోలులో జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ ట్వీట్
- ఏడాది బాలుడిని కరిచి చంపేసిన కుక్కలు
- ఇలాంటి వాటిపై దృష్టిపెట్టాలంటూ కూటమి ప్రభుత్వానికి అంబటి హితవు
"వాడి మీద కేసు పెడదాం... వీళ్ళని బొక్కలో వేద్దాం... మొత్తాన్ని చితక్కొడదాం... అనే వాటి మీద నుంచి దృష్టి ఇలాంటి ఘోరాల మీద పెట్టండి. ఈ వార్త చదువుతుంటేనే హృదయం ద్రవిస్తోంది" అని ఆయన ట్వీట్ చేశారు.