55 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతున్న 'గేమ్ చేంజర్' టీజర్

Game Changer teaser garners 55 million views
  • రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్
  • నిన్న లక్నోలో టీజర్ రిలీజ్
  • ఒక్క రోజు వ్యవధిలో వ్యూస్ వెల్లువ
  • 2025 జనవరి 10న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో వస్తున్న క్రేజీ చిత్రం గేమ్ చేంజర్. నవంబరు 9న ఈ చిత్రం నుంచి టీజర్ రిలీజైంది. ఈ టీజర్ కు వస్తున్న రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే 55 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. 

ఈ టీజర్ ను వినూత్న రీతిలో యూపీ రాజధాని లక్నోలో లాంచ్ చేశారు. నిన్న సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో రామ్ చరణ్, హీరోయిన్ కియారా అద్వానీ, అంజలి, ఎస్ జె సూర్య, దిల్ రాజు పాల్గొన్నారు. ఈ టీజర్ ను పలు భాషల్లో రిలీజ్ చేశారు. ప్రతి లాంగ్వేజ్ లోనూ గేమ్ చేంజర్ టీజర్ వ్యూస్ పరంగా దూసుకెళుతోంది. 

గేమ్ చేంజర్ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10న సంక్రాంతి సందర్భంగా వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రానికి ఎక్స్ ట్రార్డినరీ హైప్ వచ్చింది.

Go Back to Shorts
Game Changer
Teaser
Ram Charan
Shankar
SVC
Zee Studios

More Telugu News