'గేమ్ ఛేంజర్' నుంచి కొత్త పోస్టర్ విడుదల
- హీరోయిన్ కియారా అద్వానీ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
- రేపే 'గేమ్ ఛేంజర్' టీజర్ విడుదల
- జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సినిమా
హీరోయిన్ కియారా అద్వానీ కొత్త లుక్ పోస్టర్ ఒకటి వదిలారు. మోడ్రన్ ఔట్ ఫిట్ లో కియారా కూల్ లుక్ అదిరిపోయింది. "గ్లోబల్ స్టార్ మ్యాజిక్ అండ్ బ్యూటిఫుల్ కియారా అనుభూతి పొందేందుకు ఇక ఒక్క రోజే ఉంది" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కాగా, రేపు (శనివారం) ఈ సినిమా టీజర్ విడుదల కానుంది. లక్నో వేదికగా టీజర్ లాంచ్ ఈవెంట్ ప్లాన్ చేశారు.
ఇక ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అంజలి, శ్రీకాంత్, సునీల్, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.