Ukraine: యుద్ధాన్ని పక్కనపెట్టి.. పోర్న్ చూడటంలో మునిగితేలుతున్న కిమ్ సైన్యం!

North Korean Army Now Enjoying Unlimited Freedom In Russia
  • ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు మద్దతుగా నార్త్ కొరియా సైన్యం
  • అపరిమితంగా ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో అశ్లీల చిత్రాలు చూస్తూ గడుపుతున్న వైనం
  • వెల్లడించిన బ్రిటన్ వార్తా సంస్థ ‘ది ఫైనాన్షియల్ టైమ్స్’
ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు సాయంగా వెళ్లిన ఉత్తర కొరియా సైన్యానికి అపరిమిత స్వేచ్ఛ దొరికింది. దీంతో వారు యుద్ధాన్ని పక్కనపెట్టి ఇన్నాళ్లు తమకు దూరమైన స్వేచ్ఛను అనుభవిస్తున్నట్టు బ్రిటన్ వార్తా సంస్థ ‘ది ఫైనాన్షియల్ టైమ్స్’ పేర్కొంది. ఉక్రెయిన్‌ సరిహద్దులకు చేరుకున్న ఉత్తర కొరియా సైన్యానికి ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో అక్కడ వారు ‘పోర్న్’ చూడటంలో మునిగి తేలుతున్నట్టు తెలిపింది. గతంలో ఇటువంటి వెసులుబాటు లేకపోవడంతో అందివచ్చిన అవకాశాన్ని వారు ‘సద్వినియోగం’ చేసుకున్నట్టు పత్రిక తన కథనంలో రాసుకొచ్చింది. అయితే, ఈ సమాచారం ఎలా సేకరించిందన్న వివరాలను వెల్లడించలేదు. 

రష్యాకు మద్దతుగా దాదాపు 11 వేల మంది ఉత్తర కొరియా సైనికులు రష్యా చేరుకున్నట్టు వార్తలు వచ్చాయి. దక్షిణ కొరియాతోపాటు, ‘నాటో’ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఇలా వెళ్లిన కిమ్ సైన్యం తూర్పు రష్యాలో శిక్షణ పొందుతున్నట్టు ఉక్రెయిన్ వర్గాలు పేర్కొన్నాయి. శిక్షణ అనంతరం కుర్స్క్‌లో వారిని మోహరించారని, వారిలో చాలామందిని తాము చంపేశామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ నిన్న ప్రకటించారు.  
Ukraine
Russia
War
North Korean Army

More Telugu News