krish jagarlamudi: డైరెక్టర్ క్రిష్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారా...?

director krish jagarlamudi is marrying a divorcee doctor with an 11 year old son
  • డైరెక్టర్ క్రిష్ రెండో వివాహంపై సోషల్ మీడియాలో వార్తలు
  • రెండో వివాహం చేసుకోబోయేది వైద్యురాలేనని టాక్ 
  • మొదటి భర్త నుండి విడాకులు తీసుకున్న ఆమెకు 11 ఏళ్ల బాలుడు ఉన్నాడని సమాచారం
ప్రముఖ సినీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రెండో వివాహానికి సిద్ధమవుతున్నారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్నాళ్ల క్రితం రమ్య అనే వైద్యురాలిని క్రిష్ వివాహం చేసుకున్నారు. అయితే వారి వివాహ బంధంలో సమస్యలు ఎదురవ్వడంతో పరస్పర అంగీకారంతో ఆమధ్య విడాకులు తీసుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో క్రిష్ మరో వివాహానికి సిద్ధం అవుతున్నారని, వచ్చే వారం వివాహ నిశ్చితార్ధ వేడుక జరగనుందన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. క్రిష్ రెండో వివాహం చేసుకోబోయేది కూడా వైద్యురాలేనని తెలుస్తోంది. అయితే ఆమెకు 11 ఏళ్ల కుమారుడు ఉన్నాడని, ఆమె మొదటి భర్తతో డైవర్స్ తీసుకున్నట్లుగా చెబుతున్నారు. అయితే క్రిష్ రెండో వివాహానికి సంబంధించి అధికారికంగా సమాచారం లేదు. 
krish jagarlamudi
director
Movie News

More Telugu News