ఎడారి నగరంలో ఐపీఎల్-2025 మెగా వేలం!
- ఇటీవలే రిటెన్షన్ జాబితాలు ప్రకటించిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు
- పెద్ద సంఖ్యలో ఆటగాళ్ల విడుదల
- నవంబరు చివరి వారంలో ఐపీఎల్ వేలం!
కాగా, ఐపీఎల్ మెగావేలం-2025 ఈ ఏడాది డిసెంబరులో ఉంటుందని నిన్న మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఐపీఎల్ వేలం ఈ నెలాఖరులో జరగనుంది. సౌదీ అరేబియా రాజధాని నగరం రియాద్ ఈ వేలం కార్యక్రమానికి ఆతిథ్యమివ్వనుందని తెలుస్తోంది. వేదిక, తేదీ వివరాలపై త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి.