లాహోర్ లో కాలుష్యానికి భారతదేశమే కారణం.. పాక్ వింత వాదన
- పాకిస్థాన్ లోని పంజాబ్ సిటీలో దారుణంగా రికార్డయిన ఏక్యూఐ
- మన దేశం నుంచి వీచే గాలులతో వాయు కాలుష్యం పెరిగిందని ఆరోపణ
- ఓ టీవీ ఇంటర్వ్యూలో పాక్ పంజాబ్ మంత్రి విమర్శలు
ఏక్యూఐ ఏకంగా 1,067 పాయింట్లు నమోదైంది. దీనిపై అక్కడి మంత్రి మరియం ఆదివారం ఓ మీడియాతో మాట్లాడారు. లాహోర్ లో వాయు కాలుష్యం పెరగడానికి భారత దేశంలోని పంజాబ్ నుంచి వీచే గాలులే కారణమని ఆరోపించారు. గాలి వేగం, వీచే దిశ మారడం వల్ల పొరుగు దేశం నుంచి కలుషిత గాలి లాహోర్ కు చేరుకుని ఏక్యూఐ దారుణంగా పెరిగిందని మండిపడ్డారు. ఆదివారం లాహోర్ లో ఏక్యూఐ 500 పాయింట్లకు కాస్త అటూ ఇటుగా ఉందని మరియం తెలిపారు. అయితే, ఈ విషయంలో మనం చేయగలిగింది ఏమీ లేదని అన్నారు. వీచే గాలిని ఆపడం కుదరదని, భారత్ తో చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆమె వెల్లడించారు.