రైలులో ప్రయాణిస్తూ కిందనున్న బందరు కాల్వలోకి దూకేసిన మహిళ
- విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో ఘటన
- కొన్నేళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతున్న మహిళ
- కాల్వలో కొట్టుకుపోతూ ఓ చెట్టును ఆసరాగా చేసుకుని రాత్రంతా అలాగే గడిపిన వైనం
- రక్షించి ఆసుపత్రికి తరలించిన పోలీసులు
రాత్రి 11 గంటల సమయంలో రైలు విజయవాడ పూల మార్కెట్ పరిసరాలకు చేరుకుంది. అక్కడామె రైలు నుంచి కిందనున్న బందరు కాల్వలోకి దూకేసింది. నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతానికి చేరుకుంది. అక్కడ ఓ చెట్టును పట్టుకుని రాత్రంతా అలాగే గడిపింది. ఉదయం స్థానికులు ఆమెను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి ఆమెను రక్షించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి, ఆసుపత్రికి తరలించారు.