తొలిసారిగా రుషికొండ ప్యాలెస్ ను పరిశీలించిన సీఎం చంద్రబాబు
- విశాఖ జిల్లాలో చంద్రబాబు పర్యటన
- రుషికొండ చేరుకున్న సీఎం
- రుషికొండ భవనాల లోపలికి వెళ్లి చూసిన చంద్రబాబు
- ముఖ్యమంత్రికి వివరాలు తెలిపిన గంటా శ్రీనివాసరావు, అధికారులు
ఈ సందర్భంగా చంద్రబాబు వెంట మంత్రి కందుల దుర్గేశ్, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా ఉన్నారు. రుషికొండ ప్యాలెస్ వివరాలను గంటా... సీఎం చంద్రబాబుకు వివరించారు. చంద్రబాబు అధికారులను అడిగి మరికొన్ని వివరాలు తెలుసుకున్నారు. పలు భవనాల లోపలికి కూడా వెళ్లిన చంద్రబాబు... అక్కడి విలాసవంతమైన సౌకర్యాలను పరిశీలించారు.
కాగా, భవనాల నిర్వహణ ఖర్చు, విద్యుత్ బిల్లుల భారం ఎక్కువగా ఉందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రుషికొండ భవనాలను ఎలా వినియోగించాలన్న దానిపై చర్చించాల్సి ఉందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పేర్కొన్నట్టు తెలుస్తోంది.