కోదాడ వద్ద ప్రైవేటు బస్సును ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. 30 మందికి గాయాలు
- జాతీయ రహాదారిపై కోదాడ వద్ద ఘటన
- ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళుతుండగా ప్రమాదం
- కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు
ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. రోడ్డు ప్రమాద సమాచారం తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వల్ప గాయాలతోనే ప్రయాణికులు బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.