పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు... వివరాలు ఇవిగో!
- పెరగని గృహ వినియోగ (డొమిస్టిక్ సిలిండర్) సిలిండర్ ధరలు
- పేద, మధ్యతరగతి వర్గాలకు ఊరట
- పేద, మధ్యతరగతి వర్గాలపై పరోక్షంగా ప్రభావం
వాణిజ్య సిలిండర్ ధరల పెంపు పేద, సామాన్య ప్రజానీకంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపకపోయినా పరోక్షంగా ఆ ప్రభావం పడుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ కు రూ.62లు పెరిగి, రూ.1802లకు చేరుకుంది.
ఇదే సమయంలో చమురు కంపెనీలు ఏటీఎఫ్ ధరలను కూడా పెంచాయి. దీంతో విమాన చార్జీలు పెరిగే అవకాశం ఉంది. పెరిగిన ధరతో ఏ ప్రాంతంలో వాణిజ్య సిలిండర్ ధర ఏ విధంగా ఉందో చూస్తే .. హైదరాబాద్ లో రూ.2028లు, విజయవాడలో రూ.1962, కోల్‌కతాలో రూ.1911.50లు, ముంబయిలో రూ.1754.50లు, చెన్నైలో రూ.1964.50లకు చేరింది.