సైబరాబాద్ పరిధిలో బాణసంచా కాల్చడంపై ఆంక్షలు!: సైబరాబాద్ సీపీ
- సైబరాబాద్ పరిధిలో రాత్రి 8 నుంచి 10 వరకు మాత్రమే కాల్చుకోవాలన్న సీపీ
- నవంబరు 2 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని వెల్లడి
- పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరిమితులకు లోబడి టపాసులు కాల్చుకోవాలన్న సీపీ
ఈరోజు నుంచి నవంబర్ 2వ తేదీ వరకు దీపావళి పండుగ సందర్భంగా ఈ నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు. రాత్రి ఎనిమిది గంటలకు ముందు గానీ లేదా రాత్రి 10 గంటల తర్వాత గానీ బహిరంగ ప్రదేశాల్లో, పబ్లిక్ రోడ్లపై బాణసంచా కాలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. దీనిని గమనించి అందరూ దీపావళి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.