YS Sharmila: జగన్‌తో ఆస్తుల వివాదం... షర్మిలకు భద్రతను పెంచాలని డీజీపీకి కాంగ్రెస్ విజ్ఞప్తి

AP Congress appeals DGP abou Sharmila security
షార్ట్స్‌లో చూడండి
సోదరుడు జగన్‌తో ఆస్తుల వివాదం నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు భద్రతను పెంచాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు బుధవారం డీజీపీకి వినతిపత్రం ఇచ్చారు. షర్మిలకు ప్రస్తుతం ఉన్న 2+2 గన్ మెన్‌కు బదులు 4+4 గన్ మెన్‌ను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలో షర్మిలకు వై కేటగిరీ సెక్యూరిటీని కల్పించారని, దానిని కొనసాగించాలని కూడా కాంగ్రెస్ నేతలు ఆ లేఖలో కోరారు. ఆమెకు వై కేటగిరీ భద్రతను ఆంధ్రప్రదేశ్‌లోనూ కొనసాగించాలని కోరారు. పార్టీ అధినాయకురాలిగా ఆమె చేసే ముఖ్యమైన కార్యక్రమాలకు భద్రత అవసరమని పేర్కొన్నారు.
Go Back to Shorts
YS Sharmila
YS Jagan
Andhra Pradesh
Congress

More Telugu News