50 సంవత్సరాల నట ప్రస్థానం.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్!
"డిగ్రీ చదువుకునేటప్పుడు నర్సాపూర్ వైఎన్ఎం కాలేజ్ లో రంగస్థలం మీద రాజీనామా అనే తొలి నాటకం వేశాను. నటుడిగా తొలి గుర్తింపు వచ్చింది. అది బెస్ట్ యాక్టర్‌ను చేయడంతో పాటు ఎనలేని ప్రోత్సాహాన్ని అందించింది. 1974 -2024: 50 సంవత్సరాల నట ప్రస్థానం.. ఎనలేని ఆనందం!" అని చిరు తన పోస్టులో రాసుకొచ్చారు.
దీనికి అప్పటి తన పాత ఫొటోను జోడించారు. ప్రస్తుతం మెగాస్టార్ షేర్ చేసిన ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మెగా అభిమానులు దీన్ని తెగ షేర్ చేస్తున్నారు.