బాంబు బెదిరింపు... ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చే విమానం దారి మళ్లింపు
- పది రోజులుగా దేశవ్యాప్తంగా పలు విమానాలకు బాంబు బెదిరింపులు
- ఈరోజు మూడు విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపు మెయిల్స్
- బెదిరింపుల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు
ఈ రోజు మూడు విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఇండిగో, విస్తారా, ఆకాశ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో ఆయా సంస్థల అధికారులు అప్రమత్తమయ్యారు. విమానాశ్రయాల్లో భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించింది. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావాల్సిన విస్తారా విమానాన్ని దారి మళ్లించారు.