Sensex: ఫ్లాట్‌గా ముగిసిన భారత స్టాక్ మార్కెట్

Sensex Nifty end flat with negative bias
షార్ట్స్‌లో చూడండి
భారత స్టాక్ మార్కెట్ ఈరోజు ఫ్లాట్‌గా ముగిసింది. వరుసగా నాలుగో రోజు సూచీలు నష్టపోయినప్పటికీ... ఈరోజు అతి స్వల్పంగా పడిపోయాయి. నిన్న సూచీలు భారీగా పడిపోయిన విషయం తెలిసిందే. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, కంపెనీల త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో వరుస నష్టాలతో ట్రేడ్ అవుతున్న సూచీలు ఈరోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి.

నిఫ్టీ ఎఫ్ఎంసీజీ టాప్ లూజర్‌గా నిలిచింది. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 2 శాతానికి పైగా క్షీణించింది. సెన్సెక్స్ 16.82 పాయింట్లు నష్టపోయి 80,065 వద్ద... నిఫ్టీ 36 పాయింట్లు క్షీణించి 24,399 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.07 వద్ద ఉంది. 

అల్ట్రా టెక్ సిమెంట్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదానీ పోర్ట్స్ స్టాక్స్ లాభాల్లో ముగియగా... హిందూస్థాన్ యూనీలీవర్, నెస్లే ఇండియా, ఐటీసీ, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టపోయాయి.
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News