హైదరాబాద్‌లో బీజేపీ కీలక సమావేశం... బండి సంజయ్, రాజాసింగ్ గైర్హాజరు!
- కిషన్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేల సమావేశం
- వివిధ కారణాల వల్ల హాజరుకాని పలువురు నేతలు
- పార్టీ బలోపేతంపై చర్చించామన్న మహేశ్వర్ రెడ్డి
కిషన్ రెడ్డి అధ్యక్షతన దాదాపు రెండున్నర గంటల పాటు సమావేశం జరిగింది. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ బన్సల్ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, బీజేపీ సభ్యత్వ నమోదుపై చర్చించారు.
పార్టీ బలోపేతంపై చర్చించాం: మహేశ్వర్ రెడ్డి
ఈ సమావేశంలో పార్టీ బలోపేతంపై చర్చించినట్లు బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని సునీల్ బన్సల్ సూచించారన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై చర్చించామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక, వ్యూహాలపై కూడా చర్చించామన్నారు. 23, 24 తేదీల్లో మూసీ పరీహవాక ప్రాంతంలో పర్యటిస్తామని తెలిపారు. పరీవాహక ప్రాంతంలోని ప్రజల గోడును వింటామన్నారు. హైడ్రా, మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకంగా ఈ నెల 25న భారీ ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు.