Asaduddin Owaisi: యూపీ ఉపఎన్నికల్లో పోటీపై స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ

Asaduddin Owaisi responds on UP bypolls
షార్ట్స్‌లో చూడండి
ఉత్తరప్రదేశ్ ఉపఎన్నికల్లో పోటీపై మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టతనిచ్చారు. యూపీలో క్రియాశీలకంగా ఉన్న అప్నాదళ్ (కామెరవాడి) పార్టీతో పొత్తుతో ముందుకు సాగుతామన్నారు. యూపీ ఉప ఎన్నికల్లో అప్నాదళ్ నేత డాక్టర్ పల్లవీ పటేల్‌తో కలిసి పోటీ చేస్తామన్నారు.

పొత్తుకు సంబంధించి చర్చలు ఇప్పటికే ముగిశాయని తెలిపారు. రెండు స్థానాల్లో పోటీ చేద్దామని అక్కడి తమ పార్టీ అధ్యక్షుడు చెప్పారని, మిగిలిన సీట్లకు సంబంధించి పల్లవి పటేల్ నిర్ణయిస్తారన్నారు. ఈ ఉప ఎన్నికల్లో తమ రెండు పార్టీలు కలిసి పోటీ చేసి, అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తాయని ఒవైసీ ధీమా వ్యక్తం చేశారు.

ఉత్తర ప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న తొమ్మిది అసెంబ్లీ అసెంబ్లీ స్థానాలకు త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఎనిమిది స్థానాల్లో ఎమ్మెల్యేలుగా ఉన్న వారు గత లోక్ సభ ఎన్నికల్లో ఎంపీలుగా విజయం సాధించారు. మరో స్థానంలో సమాజ్‌వాది పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇర్ఫాన్ సోలంకి క్రిమినల్ కేసులో దోషిగా తేలాడు. దీంతో ఈ నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక అనివార్యమైంది.
Go Back to Shorts
Asaduddin Owaisi
Uttar Pradesh
Bypolls
BJP

More Telugu News