మూసీ ప్రాజెక్టుపై తీవ్ర ఆరోపణలు... కేటీఆర్‌పై కేసు నమోదు
- మూసీ ప్రాజెక్టుపై కేటీఆర్ ఆరోపణలు
- ఢిల్లికి రూ.25 వేల కోట్లు పంపిస్తున్నారని కేటీఆర్ ఆరోపణ
- ఉట్నూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణ
ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూరు పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదయింది. మూసీ ప్రాజెక్టు లక్షన్నర కోట్ల రూపాయల కుంభకోణమని, అందులో రూ.25 వేల కోట్లు ఢిల్లీకి పంపుతున్నారని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై ఆమె ఫిర్యాదు చేశారు.
ఆత్రం సుగుణ 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి గోడం నగేశ్ చేతిలో 90 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు.