నాకున్న ఆరోగ్య సమస్య గురించి తెలిసి కూడా పెళ్లి చేసుకున్నాడు: అలియా భట్

Alia Bhatt speaks about her health issue
  • తనకు హైపర్ టెన్షన్ ఉందని చెప్పిన అలియా
  • ప్రతి విషయానికి టెన్షన్ పడిపోవడం తన బలహీనత అని వెల్లడి
  • రణబీర్ తనకు భర్తగా దొరకడం తన అదృష్టమని వ్యాఖ్య
అర్థం చేసుకునే భర్త దొరకడం ఏ భార్యకైనా అదృష్టమేనని బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ అన్నారు. తనను పూర్తిగా అర్థం చేసుకునే రణబీర్ కపూర్ భర్తగా దొరకడం తన అదృష్టమని చెప్పారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 

చిన్నప్పటి నుంచి తనకు హైపర్ టెన్షన్ సమస్య ఉందని... ప్రతి విషయానికి టెన్షన్ పడిపోవడం తన బలహీనత అని అలియా తెలిపారు. హైపర్ టెన్షన్ వల్ల ఒక్కోసారి నియంత్రణ కోల్పోతుంటానని చెప్పారు. తన సమస్య తెలిసి కూడా రణబీర్ తనను పెళ్లి చేసుకున్నాడని అన్నారు. 

రెండేళ్ల క్రితం క్రిస్మస్ రోజున ఇద్దరం బయటకు లంచ్ కు వెళ్లామని... అప్పుడు కూడా అనుకోకుండా సమస్య తలెత్తిందని అలియా చెప్పారు. కుమార్తె రాహా గురించి మాట్లాడుతూ... పేరు పెట్టిన తర్వాత తమ కుమార్తెను మీడియాకు పరిచయం చేద్దామని అనుకున్నామని... అయితే హైపర్ టెన్షన్ వల్ల అది కుదరలేదని తెలిపారు. హైపర్ టెన్షన్ అనేది బయటకు కనిపించనంత పెద్ద సమస్య అని... భరించే వాళ్లకే అదేంటో తెలుస్తుందని చెప్పారు. ఈ రుగ్మత ఉన్న వాళ్లకు ఎంతో ఓర్పు అవసరమని అన్నారు. తాను హైపర్ టెన్షన్ కు గురైన ప్రతిసారి... రణబీర్ టాపిక్ మార్చేసి, తనను నార్మల్ గా చేస్తాడని చెప్పుకొచ్చారు.
Advertisement
Alia Bhatt
Ranbir Kapoor
Bollywood

More Telugu News