దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
- రాష్ట్ర సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందన్న సీఎం
- కుటుంబ సభ్యులందరూ కలిసి సంబురాలు చేసుకుంటారన్న ముఖ్యమంత్రి
- ప్రజలందరికీ సుఖసంతోషాలు ప్రసాదించాలని దుర్గామాతను ప్రార్థించిన సీఎం
శమీపూజ చేసి జమ్మి ఆకును బంగారంగా భావించి అలాయ్ బలాయ్ ఇస్తారని, పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారని గుర్తు చేశారు. శుభసూచకంగా భావించే పాలపిట్టను దర్శించుకోవడం తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమని తెలిపారు. తెలంగాణకు నిత్య విజయాలు కలగాలని, ప్రజలందరికీ సుఖసంతోషాలను ప్రసాదించాలని దుర్గామాతను ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.