ఒవైసీ కాలేజీని హైడ్రా వందశాతం కూలుస్తుంది: కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్
- ఎంఐఎం తనపై దాడిచేసినా కాంగ్రెస్ స్పందించలేదని ఫిరోజ్‌ఖాన్ ఆవేదన
- ఎంఐఎం అక్రమాలు బయటపెట్టినందుకే తనపై దాడి జరుగుతోందని ఆరోపణ
- కేటీఆర్‌పై కొండా సురేఖ వ్యాఖ్యలు నిజమేనన్న నేత
హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌లో నిన్న కాంగ్రెస్, ఎంఐఎం నేతల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్, కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ అనుచరుల మధ్య గొడవ జరిగింది. బ్యాంకు కాలనీలో జరుగుతున్న రహదారి పనులను పరిశీలించేందుకు ఫిరోజ్‌ఖాన్ వెళ్లడంతో ఇరు వర్గాల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ ఘటనలో కాంగ్రెస్, ఎంఐఎం కార్యకర్తలకు దెబ్బలు తగలడం మరింత ఉద్రిక్తతకు కారణమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు.