TTD: శ్రీవారి అన్నప్రసాదంలో జెర్రి పడిందన్న వార్తలు అవాస్తవం: టీటీడీ

TTD clarifies on false propaganda
షార్ట్స్‌లో చూడండి
వెంకటేశ్వరస్వామి అన్నప్రసాదంలో జెర్రి పడిందన్న ప్రచారంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పందించింది. మాధవ నిలయంలో తాము తిన్న అన్నప్రసాదంలో జెర్రి కనిపించిందని ఓ భక్తుడు చేసిన ఆరోపణలు వాస్తవదూరం అని స్పష్టం చేసింది. 

తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే వేలాది భక్తులకు వడ్డించడానికి టీటీడీ సిబ్బంది పెద్ద మొత్తంలో అన్నప్రసాదాలను ఎప్పటికప్పుడు తయారు చేస్తారని, అంత వేడిలో కూడా ఏమాత్రం చెక్కుచెదరకుండా ఒక జెర్రి ఉందని ఆ భక్తుడు పేర్కొనడం ఆశ్చర్యం కలిగిస్తోందని టీటీడీ తన ప్రకటనలో పేర్కొంది. 

ఒకవేళ పెరుగన్నం కలపాలన్నా... ముందుగా వేడి చేసిన అన్నాన్ని బాగా కలియదిప్పి, ఆ తర్వాత పెరుగు కలుపుతారని వివరించింది. అలాంటి సమయంలో కూడా జెర్రి రూపు ఏమాత్రం చెక్కుచెదరకుండా ఉందనడం పూర్తిగా ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య అని భావించాల్సి వస్తోందని టీటీడీ పేర్కొంది. 

దయచేసి భక్తులు ఇలాంటి అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.
Go Back to Shorts
TTD
Annapeasadam
Creepy Crawlies
Tirumala

More Telugu News