భారతీయులకు రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలు మంజూరు చేసిన అమెరికా

USA issued record level student visas
  • 2023లో భారతీయులకు 1.4 లక్షల విద్యార్థి వీసాలు మంజూరు
  • తాజాగా అందుబాటులోకి 2.5 లక్షల వీసా అపాయింట్ మెంట్లు
  • భారతీయ విద్యార్థులకు అధిక ప్రాముఖ్యత ఇస్తున్న అమెరికా
వరుసగా నాలుగో ఏడాది కూడా అగ్రరాజ్యం అమెరికా భారతీయ విద్యార్థులకు రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలు మంజూరు చేసింది. ఎన్ని వీసాలు జారీ చేసిందన్నదానిపై కచ్చితమైన సంఖ్య తెలియనప్పటికీ, 2023లో సుమారు 1.4 లక్షలకు పైగా వీసాలు జారీ చేసి ఉంటుందని భావిస్తున్నారు. ప్రపంచంలో మరే ఇతర దేశానికి కూడా అమెరికా ఇన్ని స్టూడెంట్ వీసాలు మంజూరు చేయలేదని తెలుస్తోంది. 

దీనిపై భారత్ లో అమెరికా దౌత్య కార్యాలయ వర్గాలు స్పందిస్తూ, ఈ వేసవిలో రికార్డు స్థాయిలో వీసా దరఖాస్తులను పరిశీలించామని, దరఖాస్తుదారులందరూ తొలిసారిగా అమెరికా వెళుతున్నవారేనని వెల్లడించాయి.

కాగా, భారతీయ విద్యార్థుల నుంచి అధిక డిమాండ్ ఉన్న నేపథ్యంలో, అమెరికా కొత్తగా 2.5 లక్షల వీసా అపాయింట్ మెంట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ అపాయింట్ మెంట్ స్లాట్లను విడుదల చేయడం వల్ల... భారతీయ దరఖాస్తుదారులు తగిన వ్యవధిలో ఇంటర్వ్యూలు పూర్తి చేసేందుకు వీలు కలుగుతుందని అమెరికా ఎంబసీ వివరించింది.
Go Back to Shorts
Student Visa
USA
Indians

More Telugu News