Nara Lokesh: ఈటీవీ బ్యూరో చీఫ్ మృతిపై లోకేశ్ దిగ్భ్రాంతి

Nara Lokesh Reaction On ETV Bureau Chief Sdudden Death
--
ఈటీవీ హైదరాబాద్‌ బ్యూరో చీఫ్‌ టి.ఆదినారాయణ హ‌ఠాన్మ‌ర‌ణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఆయనకు బాధాత‌ప్త హృద‌యంతో అశ్రునివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నిబద్ధతకల జర్నలిస్టును కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు. ఆదినారాయణ రెండున్నర దశాబ్దాలుగా ఈటీవీలో పనిచేశారని గుర్తుచేశారు. ఆయన కుటుంబానికి లోకేశ్ సానుభూతి తెలిపారు.
Nara Lokesh
Etv
Adinarayana
Etv Bureau Chief

More Telugu News