insurance lok adalat: అక్టోబర్ మొదటి వారంలో విజయవాడలో 'ఇన్సూరెన్స్ లోక్ అదాలత్'

insurance lok adalat in the first week of october
షార్ట్స్‌లో చూడండి
ఈ నెల మొదటి వారంలో సంభవించిన బుడమేరు వరదల వల్ల విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయిన కారణంగా దెబ్బతిన్న పలు మోటారు వాహనాల బీమా క్లైమ్‌ల సత్వర పరిష్కారానికై వచ్చే నెల 1 నుండి 7 వరకు విజయవాడలో ఇన్సూరెన్సు లోక్ అధాలత్‌ను నిర్వహించనున్నామని, వరద బాధితులందరూ ఈ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ (డిస్ట్రిక్టు అండ్ సెషన్స్ జడ్జి) ఎమ్.బబిత విజ్ఞప్తి చేశారు. 

ఈ మేరకు బుధవారం రాష్ట్ర సచివాలయం సమీపంలో గల రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో బీమా కంపెనీలు, ఆటోమొబైల్ బాడీ షాప్స్ మరియు ఆటో డ్రైవర్ల అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో మోటారు వాహనాల బీమా క్లైమ్ల సత్వర పరిష్కార అంశంలో ఎదురవుతున్న పలు సమస్యలు, వాటి పరిష్కారానికై తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మరియు కార్య నిర్వాహక అధ్యక్షులు, న్యాయమూర్తి జస్టిస్ జి.నరేందర్ ఆదేశాల మేరకు ఈ ఇన్సూరెన్సు లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మోటారు వాహనాల బీమా క్లైమ్లకు సంబంధించి వచ్చిన దరఖాస్తులు అన్నింటినీ సానుకూలంగా పరిశీలిస్తూ బాధితులకు సాధ్యమైనంత మేర మేలు జరిగే విధంగా తగు చర్యలు తీసుకోవాలని బీమా కంపెనీల ప్రతినిధులను ఆమె కోరారు.
Go Back to Shorts
insurance lok adalat
Vijayawada
budameru floods

More Telugu News