చేపల లారీ బోల్తా.. ఎగబడి ఏరుకున్న జనం.. వీడియో ఇదిగో!
ఖమ్మం వైపు నుంచి వరంగల్ వెళ్తుండగా లారీ అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. లారీ బోల్తాపడడంతో అందులో బతికున్న చేపలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడి కొట్టుకున్నాయి. వాటిని చూసిన జనం ఏరుకునేందుకు పోటీపడ్డారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని జనాన్ని అదుపు చేశారు.