శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని సీఎం చంద్రబాబును ఆహ్వానించిన టీటీడీ
- అక్టోబరు 4 నుంచి 12 వరకు తిరుమలలో దసరా బ్రహ్మోత్సవాలు
- ఉండవల్లిలోని సీఎం నివాసానికి వచ్చిన టీటీడీ అధికారులు, అర్చకులు
- సీఎం చంద్రబాబుకు ఆహ్వాన పత్రిక అందజేత
ఇవాళ ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వచ్చిన టీటీడీ ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్యచౌదరి సీఎం చంద్రబాబుకు ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా అర్చకులు, వేదపండితులు చంద్రబాబుకు వేదాశీర్వచనం ఇచ్చి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులకు, అర్చకులకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.