వరద బాధితుల కోసం కుమారి ఆంటీ ఆర్థిక సాయం... సీఎంకు అందజేత

Kumari Aunty donates Rs 50000 to CM Relief Fund
  • రూ.50 వేల ఆర్థిక సాయాన్ని అందించిన కుమారి ఆంటీ
  • సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సాయం అందించిన కుమారి ఆంటీ
  • కుమారి ఆంటీకి శాలువా కప్పి సన్మానించిన సీఎం
కుమారి అంటీ తన మంచి మనసును చాటుకుంది. వరద బాధితుల సహాయార్థం ఆమె ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 వేల ఆర్థిక సాయాన్ని అందించింది. సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆమె ఈ మొత్తాన్ని అందించింది. కుమారి ఆంటీకి ముఖ్యమంత్రి శాలువా కప్పి సన్మానించారు. వరద బాధితులకు తనవంతుగా సాయం చేసినందుకు అభినందించారు. 

కుమారి ఆంటీ హైదరాబాద్‌లో రోడ్డు సైడ్ ఫుడ్ స్టాల్ పెట్టుకొని బిజినెస్ చేస్తుంటుందన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా కారణంగా గత ఏడాది ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయింది. ఆమె ఫుడ్ స్టాల్‌ను అధికారులు తొలగించడంతో అప్పుడు చర్చకు దారి తీసింది. ఆ తర్వాత ఆమె అక్కడే ఫుడ్ స్టాల్ నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించారు.
Advertisement
Kumari Aunty
Revanth Reddy
Telangana
Congress

More Telugu News