చంద్రబాబు చిత్రపటానికి పుష్పాభిషేకం చేసిన బుద్దా వెంకన్న

Budda Venkanna praises Chandrababu
  • బుద్దా కార్యాలయంలో చంద్రబాబు చిత్రపటానికి పూవులతో అభిషేకం
  • కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ కార్యకర్తలు, వరద బాధితులు
  • విపత్తు సమయంలో చంద్రబాబు చేపట్టిన చర్యలు ఆదర్శనీయమన్న బుద్దా
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై టీడీపీ నేత బుద్దా వెంకన్న మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు. తన కార్యాలయంలో చంద్రబాబు చిత్రపటానికి పుష్పాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ... వరదల విపత్తు సమయంలో చంద్రబాబు చేపట్టిన సహాయక చర్యలు అందరికీ ఆదర్శనీయమని చెప్పారు. 75 ఏళ్ల వయసులో కూడా రాత్రింబవళ్లు వరద ప్రభావిత ప్రాంతాల్లోనే ఆయన ఉన్నారని కొనియాడారు. ఇప్పుడు వరద బాధితులకు రూ. 25 వేల సాయం అందిస్తున్నారని చెప్పారు. మన దేశంలో ఈ తరహాలో సాయం అందించిన సీఎం ఎవరూ లేరని అన్నారు. 

ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలతో పాటు వరద బాధితులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు 'మా బాబు బంగారం' అంటూ నినాదాలు చేశారు. మరోవైపు ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబుపై బుద్దా వెంకన్న తన స్వామి భక్తిని చాటుకున్నారు. తన రక్తంతో చంద్రబాబు చిత్రపటానికి అభిషేకం చేశారు. ఈ ఘటన అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
Go Back to Shorts
Budda Venkanna
Chandrababu
Telugudesam

More Telugu News