టీనేజర్లకు ఇన్‌స్టాగ్రామ్ లో ప్రత్యేక అకౌంట్లు... మెటా నిర్ణయం
- సోషల్ మీడియా దిగ్గజం మెటా కీలక నిర్ణయం
- 18ఏళ్ల లోపు వారికి ప్రత్యేకంగా టీన్ అకౌంట్లు
- ఇకపై తల్లిదండ్రుల నియంత్రణలో పిల్లల ఇన్‌స్టా అకౌంట్ లు
టీన్ అకౌంట్స్ వారి పెద్దల పర్యవేక్షణలో ఉంటాయి. 16 ఏళ్ల లోపు ఉన్న యూజర్లు డీఫాల్ట్ సెట్టింగ్స్‌ను మార్పు చేసుకోవాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. దీని వల్ల పిల్లలు వాడే ఇన్‌స్టా అకౌంట్‌పై తల్లిదండ్రుల నిఘా సాధ్యమవుతుందని మెటా వెల్లడించింది. టీన్ ఖాతాలకు సెన్సిటివ్ కంటెంట్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి చూపించే ఫీడ్ పై నియంత్రణ ఉంటుంది. డైరెక్ట్ మెసేజ్ లు, కామెంట్స్ లో అసభ్య పదజాలాన్ని ఇన్‌స్టా ఆటోమేటిక్‌గా ఫిల్టర్ చేస్తుంది. పేరెంట్స్ కావాలంటే పిల్లల ఇన్‌స్టా మెసేజ్‌లను యాక్సెస్ చేయవచ్చు అలానే రోజువారీ వినియోగాన్ని తనిఖీ చేయడం, నిర్ణీత సమయంలోనే ఇన్‌స్టా వాడకుండా బ్లాక్ చేయడం వంటివి చేయవచ్చు.