బంపర్ ఆఫర్లతో వస్తున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్
- సెప్టెంబర్ 27న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్
- ప్రైమ్ మెంబర్లకు సెప్టెంబర్ 26 నుంచే సేల్
- ఎస్‌బీఐ కార్డుదారులకు పది శాతం డిస్కౌంట్
సేల్ లో భాగంగా మొబైల్‌పై 40 శాతం, ఎలక్ట్రానిక్స్‌పై 75 శాతం, గృహోపకరణాలపై 50 శాతం, ఫ్యాషన్ ఉత్పత్తులపై 50 నుండి 80 శాతం, అమెజాన్ అలెక్సా ఉత్పత్తులపై 55 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. మరో గుడ్ న్యూస్ ఏమిటంటే.. ఈ గ్రేట్ ఇండియన్ సేల్ లో భాగంగా రూ.5,999 నుంచే మొబైల్స్ విక్రయించనున్నట్లు అమెజాన్ తెలిపింది. మొబైల్ యాక్సెసరీస్ రూ.89 నుంచే ప్రారంభమవుతాయని చెప్పింది. 24 నెలల నో – కాస్ట్ ఈఎంఇ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపింది. స్మార్ట్ టీవీల ధరలు రూ.6,999, అమెజాన్ అలెక్సా, ఫైర్ టీవి స్టిక్ డివైజ్ లు రూ.1,999ల నుంచి లభిస్తాయని వెల్లడించింది. సేల్ సమయంలో ట్రావెల్ బుకింగ్‌లపైనా రాయితీ పొందవచ్చని అమెజాన్ పేర్కొంది.