కేదార్‌నాథ్‌లో చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులు క్షేమం
- వాతావరణం అనుకూలించక చిక్కుకుపోయిన యాత్రికులు
- ఆపదలో ఉన్నట్లు విజయనగరం ఎంపీకి తెలిపిన యాత్రికులు
- కేంద్ర, ఉత్తరాఖండ్ అధికారులతో మాట్లాడిన మంత్రి లోకేశ్
ఆయన వెంటనే ఈ విషయాన్ని మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి లోకేశ్ ఉత్తరాఖండ్, కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఈ అంశంపై చర్చించారు. అక్కడి అధికారులతో మాట్లాడి యాత్రికులు సురక్షితంగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే కొంతమంది యాత్రికులు గుప్తకాశీకి చేరుకున్నారు. ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాతావరణం సహకరించకపోవడంతో 20 మంది యాత్రికులు అక్కడ చిక్కుకుపోయారు.