Raveena Tandon: మిమ్మల్ని మళ్లీ కలవాలనుకుంటున్నా: రవీనా టాండన్

Raveena Tandon apologies  for  denying selfie
  • ఇటీవల లండన్ కు వెళ్లిన రవీనా టాండన్
  • సెల్ఫీ కోసం ఆమె వద్దకు వచ్చిన కొందరు వ్యక్తులు
  • భయంతో అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయిన రవీనా
తనతో సెల్ఫీ దిగేందుకు వచ్చిన వారికి సెల్ఫీ ఇవ్వకుండా అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయినందుకు బాలీవుడ్ నటి రవీనా టాండన్ క్షమాపణ చెప్పారు. తాను అలా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 

ఇటీవల రవీనా లండన్ కు వెళ్లారు. అక్కడ రోడ్ పై ఒంటరిగా వెళ్తుండగా కొందరు ఆమె వద్దకు వచ్చి సెల్ఫీ అడిగారు. అయితే ఆమె ఫొటో ఇవ్వకుండా, సెక్యూరిటీని పిలిచి అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు. 

దీనిపై ఎక్స్ వేదికగా రవీనా స్పందిస్తూ... ఇటీవల జరుగుతున్న నేరాలను చూసి తాను భయపడుతున్నట్టు తెలిపారు. వారు తన వద్దకు ఫొటో కోసం వచ్చినప్పుడు... వారు ఎందుకు వచ్చారో తెలుసుకోవడానికి కూడా తాను భయపడ్డానని చెప్పారు. ఆ సమయంలో తాను ఒంటరిగా ఉన్నానని... అందుకే భయంతో అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయానని తెలిపారు.  

వారికి ఫొటో ఇవ్వాలని తనకు అనిపించినప్పటికీ ధైర్యం చేయలేకపోయానని రవీనా చెప్పారు. మీకు ఫొటో నిరాకరించినందుకు తనను క్షమించాలని ఆమె అన్నారు. భవిష్యత్తులో మిమ్మల్ని మళ్లీ కలవాలనుకుంటున్నానని... మీతో ఫొటో దిగాలని కోరుకుంటున్నానని చెప్పారు. తన ఈ పోస్ట్ మీకు చేరాలని ఆశిస్తున్నానని అన్నారు.
Raveena Tandon
Bollywood

More Telugu News