తన తండ్రి నాగేశ్వరరావు గురించి చెప్పిన హీరో సుధీర్ బాబు
- హైదరాబాద్ లో ‘మా నాన్న సూపర్ హీరో’ మూవీ టీజర్ లాంచ్
- తన తండ్రి నాగేశ్వరరావు గురించి చెబుతూ భావోద్వేగానికి గురైన హీరో సుధీర్ బాబు
- నాలుగేళ్లలో తన కుమారుడు చరిత్ నటుడిగా తెరంగేట్రం చేయనున్నాడని సుధీర్ బాబు వెల్లడి
తన తండ్రిపై ఎంతో ప్రేమ ఉన్నా ఎప్పుడూ 'ఐ లవ్ యూ' అని చెప్పలేదని, హగ్ కూడా చేసుకోలేదని అన్నారు. ఆయనను ఆలింగనం చేసుకోవాలని ఇప్పటికీ అనిపిస్తుంటుందని, కానీ చేసుకోలేనని అన్నారు. అందుకే మా అబ్బాయిలను హగ్ చేసుకుంటుంటా అని సుధీర్ బాబు చెప్పుకొచ్చాడు. తన తండ్రి కష్టపడే మనస్తత్వం గురించి, తన కుమారుడు చరిత్ తెరంగేట్రం గురించి కూడా ఈ సందర్భంగా సుధీర్ బాబు వెల్లడించాడు. తన కుమారుడు చరిత్ నాలుగేళ్లలో నటుడిగా తెరంగేట్రం చేయనున్నాడని, తాము వద్దని వారించినా వినేలా లేడని చెప్పుకొచ్చాడు.