రజనీకాంత్ లేటెస్ట్ మూవీపై భారీ అంచనాలు.. లిరికల్ సాంగ్ రిలీజ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రజనీకాంత్ లేటెస్ట్ మూవీపై భారీ అంచనాలు.. లిరికల్ సాంగ్ రిలీజ్

Lyrical song released from Rajinikanth Vettaiyan movie
  • రజనీ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ 'వేట్టైయాన్'
  • అక్టోబర్ 10న పాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతున్న చిత్రం
  • కీలక పాత్రల్లో అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి
'మెరుపై వచ్చిండే.. మడత పెట్ట వచ్చిండే.. మనసు పెట్టి వచ్చిండే' అంటూ ప‌క్కా మాస్ బీట్‌తో అమ్మాయి పాడే పాట వింటుంటే అంద‌రికీ స్టెప్పులేయాల‌నిపిస్తుంది. ఇంత‌కీ అంత‌లా అంద‌రినీ మ‌డ‌త పెట్టేలా వ‌చ్చిందెవ‌రో తెలుసుకోవాలంటే ‘వేట్టైయాన్ - ది హంట‌ర్‌’ సినిమా చూసేయాల్సిందే. సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా భారీ బ‌డ్జెట్ చిత్రాలను రూపొందిస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోన్న ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘వేట్టైయాన్ - ది హంట‌ర్’.

‘వేట్టైయాన్ - ది హంట‌ర్‌’ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అక్టోబ‌ర్ 10న భారీ ఎత్తున విడుద‌ల చేస్తున్నారు. టి.జె. జ్ఞాన‌వేల్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లు సాధించిన 2.0, ద‌ర్బార్‌, లాల్ స‌లామ్ వంటి చిత్రాల త‌ర్వాత ర‌జినీకాంత్, లైకా ప్రొడ‌క్ష‌న్ష్ క‌ల‌యిక‌లో రాబోతున్న నాలుగో సినిమా ‘వేట్టైయాన్- ది హంట‌ర్‌’.

ఈ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. మంజు వారియ‌ర్‌, ఫ‌హాద్ ఫాజిల్, రానా ద‌గ్గుబాటి, రితికా సింగ్‌, దుష‌రా విజ‌య‌న్, రోహిణి, అభిరామి త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌లను పోషిస్తున్నారు. ఈ పాన్ ఇండియా సినిమా త‌మిళ‌, తెలుగు, హిందీ, క‌న్న‌డ భాషల్లో రిలీజ్ కానుంది. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. 

తెలుగు రిలీజ్ హ‌క్కుల‌ను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి. సోనీ మ్యూజిక్ ద్వారా పాట‌లు విడుద‌ల‌వుతున్నాయి. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Advertisement
Rajinikanth
Tollywood
Kollywood
Vettaiyan Movie

More Telugu News