ముగిసిన పారాలింపిక్స్ పోటీలు.. కొత్త చరిత్ర లిఖించిన భారత అథ్లెట్లు..!
- ఘనంగా పారిస్ పారాలింపిక్స్ ముగింపు వేడుకలు
- భారత పతాకధారులుగా ఆర్చర్ హర్విందర్ సింగ్, అథ్లెట్ ప్రీతి పాల్
- 29 పతకాలతో సత్తాచాటిన భారత అథ్లెట్లు
- తొలిసారి టాప్-20లో భారత్‌కు చోటు
ఈసారి 25 మెడల్స్ లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగిన భారత్ 4 పతకాలు అధికంగా సాధించడం విశేషం. అలాగే గత టోక్యో ఒలిపింక్స్ కంటే ఈసారి 10 మెడల్స్ ఎక్కువ రావడం గమనార్హం. దీంతో ఈసారి భారత్ టాప్-20లో చోటు దక్కించుకుంది.
29 పతకాలు సాధించిన ఇండియా 18వ స్థానంలో నిలిచింది. ఇక చైనా అగ్రస్థానం కైవసం చేసుకుంది. ఆ తర్వాత టాప్-5లో బ్రిటన్, అమెరికా, నెదర్లాండ్స్, బ్రెజిల్ నిలిచాయి.
ఘనంగా జరిగిన ఈ ముగింపు వేడుకల్లో ఫ్రెంచ్ మ్యూజీషియన్లు, గ్రామీ అవార్డ్ విన్నర్ అండర్సన్ పాక్‌ల ప్రదర్శనతో స్టేడ్ డి స్టేడియం హోరెత్తింది.