కొలువుదీరిన ఖైరతాబాద్ మహాగణపతి.. 70 అడుగుల ఎత్తులో వినాయకుడి విగ్రహం
- ఉదయం 11 గంటలకు ఖైరతాబాద్ గణనాధుడికి తొలి పూజ
- తొలిపూజలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు
- మధ్యాహ్నం పూజలో పాల్గొననున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ 28 అడుగుల వెడల్పుతో విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. పది రోజుల పాటు మహా గణపతి భక్తుల పూజలు అందుకోనున్నాడు. ఈ నెల 17న ఘనంగా నిమజ్జన వేడుక జరగనుంది. ఉదయం 11 గంటలకు వినాయకుడికి తొలి పూజ జరగనుంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పూజలో పాల్గొననున్నారు.