Hyderabad: హైద‌రాబాద్‌లో షాకింగ్ ఘ‌ట‌న‌.. భూమి పొర‌ల్లోంచి ఒక్కసారిగా పొగలు.. ఇదిగో వీడియో!

Smokes from the Ground in Hyderabad Shocks People video goes viral
హైద‌రాబాద్‌లో షాకింగ్ ఘ‌ట‌న వెలుగు చూసింది. భూమి పొర‌ల్లోంచి ఒక్కసారిగా పొగలు రావ‌డం క‌ల‌క‌లం సృష్టించింది. ఈ ఘ‌ట‌న కేబీఆర్ పార్క్ వద్ద గురువారం చోటుచేసుకుంది. ఇది చూసిన జ‌నం ఆశ్చర్యపోయారు. మొద‌ట త‌క్కువ‌గా వ‌చ్చిన పొగ‌లు, ఆ త‌ర్వాత క్ర‌మంగా పెరిగిన‌ట్లు స‌మాచారం. 

కాగా, ఇటీవ‌ల అదే ప్రాంతంలో విద్యుత్ శాఖ వారు అండర్ గ్రౌండ్‌లో 11కేవీ కేబుల్ అమర్చినట్లు తెలుస్తోంది. దానివల్లే పొగలు వచ్చి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. అయితే, పొగలు రావడానికి అసలు కారణాలు తెలియాల్సి ఉంది.
Hyderabad
Smokes
Telangana
Viral Videos

More Telugu News